ఇంకా చీకట్లోనే మగ్గుతున్నా గ్రామాలు

దేశం సాంకేతికతతో దూసుకుపోతున్నా, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపెల్లి మండలం బొప్పారం గ్రామం మాత్రం అభివృద్ధికి నోచుకోక చీకట్లోనే మగ్గుతోంది. సర్వాయిపేట, నాగంపేటల నుంచి ఈ గ్రామానికి చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దట్టమైన అటవీ మార్గంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను ఆసుపత్రికి తరలించడంలో గ్రామస్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్