గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని కడెం ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కడెం మండలంలోని అల్లంపల్లి పంచాయతీ చింతగూడలో నాటుసారా తయారుచేసే స్థావరాలపై దాడులు చేశారు. గుడుంబా తయారు చేస్తున్న అజ్మీరా దశరథ్ ఇంట్లో అయిదు లీటర్ల గుడుంబా, 200 లీటర్ల బెల్లం పాకం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.