తెలంగాణ శాసనసభ్యుల సాంస్కృతిక వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఆయన, ఈ సాంస్కృతిక కార్యక్రమంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అదిరిపోయే స్టెప్పులతో హుషారైన నృత్యం చేసి సభికులను మంత్రముగ్ధులను చేశారు. నాయకుడిగానే కాకుండా, కళల పట్ల తనకున్న ఆసక్తిని ప్రదర్శిస్తూ అందరిలోనూ ఉత్సాహం నింపారు.