విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మేకల రాజమల్లు తన ఇంటి పక్కన ఉన్న పశువుల కొట్టం నుంచి బాత్రూంకు వెళ్లే సమయంలో కరెంటు వైర్ తెగిపోవడంతో దానిని అతికించే ప్రయత్నం చేయగా, విద్యుత్ షాక్ కు గురయ్యాడు. బంధువులు ఆయనను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.