కోటపల్లి: బైక్ పై నుంచి కింద పడి ఒకరికి గాయాలు

కోటపల్లి మండలం నక్కలపల్లి జీపీఓ షేక్ హఫీజ్, నక్కలపల్లి నుంచి కోటపల్లి తాసిల్దార్ కార్యాలయానికి బైక్‌పై వస్తుండగా, శేట్ పల్లి గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో చెన్నుర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్