లక్షేటిపేట అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

లక్షేట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాండ్రపు తిరుపతి (48) అతిగా మద్యం సేవించి మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం కుటుంబ కలహాలతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోవడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం సేవించి, సమయానికి అన్నం తినక మృతి చెంది ఉంటాడని అతని తల్లి రామక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్