మంచిర్యాల: లాడ్జిలో పురుగు మందు తాగిన యువకుడి మృతి

మంచిర్యాల: చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన హరికృష్ణ (28) హైదరాబాద్‌లో కారు కొని అద్దెకు ఇవ్వడంలో నష్టాలు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 7న లాడ్జిలో పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. 15 ఏళ్ల క్రితం భర్తను, ఇప్పుడు కొడుకును కోల్పోయిన తల్లి రమ కన్నీరుమున్నీరవుతోంది.

సంబంధిత పోస్ట్