లారీ కిందపడి 10 నెలల చిన్నారి మృతి

నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లిలో లారీ కిందపడి పది నెలల చిన్నారి మిల్కీ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న తల్లి పిల్లలను ఆడుకోమని చెప్పి పనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో బూడిద లోడుతో వచ్చిన లారీ వెనక్కి నడుపుతుండగా, ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి టైరు వెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్