మనవరాలి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై కొడుకుతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన పొన్నం బాలమల్లు (66) దండేపల్లి మండలం రెబ్బనపల్లి శివారులో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. లక్షేటిపేట మండలానికి చెందిన బాల మల్లు ఈ నెల 10న కొడుకుతో గొడవపడి బయటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.