దండేపల్లి: విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి

దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ముత్తే రాజవ్వ (70) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు. ఇంటి ఆవరణలో కూలర్ సంబంధించిన తీగ ప్లాస్టర్ ఊడిపోయి ఉండగా తగిలింది. దీంతో విద్యుదాఘాతంతో మృతి చెందింది. భర్త రాజలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్