ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాలకు రానున్నారు. మంచిర్యాలలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. మంచిర్యాలకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అనంతరం ఆయన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారు.