నూతన ఆలయ అభివృద్ధికి మాజీ డిసిసి రూ. లక్ష విరాళం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, దేవాలయ తదుపరి అభివృద్ధి పనుల కొరకు ఆమె తన స్వంత నిధుల నుండి రూ. 1,00,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్