హాజీపూర్: గోదావరిలో మునిగి వృద్ధుడు మృతి

హాజీపూర్ మండలం రంగపేటకు చెందిన కాయతీ మల్లయ్య (66) గోదావరిలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మల్లయ్య, ముల్కల్ల శివారులోని గోదావరి వద్ద గేదెలను తోలుకురావడానికి నీటిలోకి దిగినప్పుడు లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో మల్లయ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్