హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన ధర్ని రాజేందర్ (40) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై స్వరూప్ రాజ్ శుక్రవారం తెలిపారు. ఈ నెల రెండున రాజేందర్ తన ఇంటి వద్ద రోడ్డుపై ఉన్న సమయంలో గుర్తు తెలియని పాము కాటేసింది. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి సంతానం లేదు. భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.