తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో వర్షం పడింది. జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 2: 30 గంటలకు వాతావరణంలో మార్పులు రావడంతో ఒకేసారి రాళ్ల వర్షం కురిసింది.