గనుల్లో వరుస ప్రమాదాలపై జీఎంతో ఐఎన్‌టీయూసీ నేతల చర్చ

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో శనివారం గనుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు నేతృత్వంలోని ఐఎన్‌టీయూసీ ప్రతినిధి బృందం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌ను కలిసి, గనుల్లో రక్షణ చర్యలపై చర్చించింది. గనుల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, యాజమాన్యం తక్షణమే స్పందించి రక్షణ చర్యలను కట్టుదిట్టం చేయాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్