జైపూర్: మేడారం జాతరలో వృద్ధురాలి మృతి

ములుగు జిల్లా మేడారం మహా జాతరలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేవల్ల సుగుణ (60) అనే వృద్ధురాలు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందారు. భర్త రమణాచారితో కలిసి మేడారానికి వచ్చిన ఆమె, జంపన్న వాగులో స్నానం చేసి వనదేవతల దర్శనానికి వెళ్తుండగా, జంపన్న వంతెన సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు.

సంబంధిత పోస్ట్