మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ శివారులో పాఠశాల విద్యార్థులను తీసుకెళుతున్న TATA ACE వాహనం శుక్రవారం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.