లక్షేటిపేట మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఉదయశ్రీ (4) పాముకాటుతో మృతి చెందింది. వందన సుధాకర్ ల చిన్న కూతురు ఉదయశ్రీ శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా కాలుపై పాము కాటువేసింది. చిన్నారి గమనించలేదు. రక్తం రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.