లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన గారిగే రాజలింగు (76) ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలోని బావిలో పడి మృతి చెందాడని ఎస్ఐ సురేష్ గురువారం తెలిపారు. మృతుడికి వయస్సు పై పడటంతో మతిస్థిమితం సరిగ్గా లేదని అంతేకాకుండా నాలుగు నెలల నుంచి మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. దవాఖానాలో చికిత్స పొందిన నయం కాలేదు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.