వడదెబ్బతో వ్యక్తి మృతి

దండేపల్లి మండలం జైతుగూడకు చెందిన ఆత్రం రాజేశ్ (50) శుక్రవారం కూలీ పనికి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగిలి మృతి చెందాడు. పని చేస్తుండగా అస్వస్థతకు గురై, ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. బాత్రూమ్‌లో స్పృహతప్పి పడిపోవడంతో లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్