మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ర్యాలీ వాగు కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడిపేటకు చెందిన భయ్యా మధుకర్ (31 )మృతి చెందినట్లు హాజీపూర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. మంచిర్యాల నుంచి ముల్కల్ల ఇసుక రీచ్ కు వస్తున్న ట్రాక్టర్ అజాగ్రత్తగా నడుపుతూ అతివేగంతో బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధుకర్ కు తీవ్ర గాయాలు కాగా, ట్రాక్టర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్