మంచిర్యాల: విషాదం.. రేకుల షెడ్డు కూలి నలుగురు రైతుల మృతి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షం అన్నదాతల జీవితాల్లో తీరని శోకాన్ని నింపాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులపై కాపలాగా ఉన్న రైతులపై రేకుల షెడ్డు కూలిపోవడంతో నలుగురు రైతులు వెంకటేశ్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్