మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

కొమరంభీం చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం మండలంలోని ఇంధన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇంధన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్, జస్వంత్ పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లే క్రమంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో లక్ష్మణ్, జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్కు ఈనెల 18న వివాహం జరగాల్సి ఉంది. అంతలోనే లక్ష్మణ్ మృతి చెందడంతో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్