రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు మంచిర్యాల జిఆర్పి ఎస్సై మహేందర్ శుక్రవారం తెలిపారు. మృతుడు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటాడని, తెలుపు నీలిరంగు షర్టు, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని శరీరం ముక్కలైపోయి ఉందని వివరించారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచామన్నారు.