మంచిర్యాల: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం

హాస్టల్ లో ఉండడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సోమవారం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నస్పూర్ లోని ప్రభుత్వ కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న మధులిఖ అనే విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన టీచర్లు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్