మంచిర్యాల: విషాదం.. కరెంటు షాక్‌తో యువకుడి మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు చెందిన ముస్లిం కుటుంబం గురువారం కాళేశ్వరంలోని దర్గా వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చింది. దర్గా వద్ద ఇనుప పైపునకు జెండా బిగించి పైకి ఎత్తే క్రమంలో, 32 ఏళ్ల ఎంఏ మజీద్, మరో వ్యక్తి పైనున్న 11 కేవీ కరెంటు తీగలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో మజీద్ చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సమీరుద్దీన్‌ను మంచిర్యాలకు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్