పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి ఆత్మహత్య

పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్ (36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కలలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు ప్రకారం లక్షేట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేష్ మంచిర్యాలలో నివాసం ఉంటూ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్