నస్పూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి యువ కార్మికుడు మృతి

నస్పూర్ మున్సిపల్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కు చెందిన గడికొప్పుల రాజేష్ (32) బైక్ అదుపుతప్పి పడడంతో శనివారం అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై సుగుణాకర్ తెలిపారు. బెల్లంపల్లి నుంచి తన ఇంటికి వస్తుండగా ఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బండరాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్