నస్పూర్ మండలంలోని అభినవ కాలనీకి చెందిన కూసి తిరుపతి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో రాసమల్లె గజానంద్, సయ్యద్ అమాన్ లను అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ మంగళవారం తెలిపారు. ఈనెల 9న దొంగతనం జరగా 2వేల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేయగా నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.