గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్థాపానికి గురై నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (24) మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. అమ్మ నన్ను క్షమించు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను. నా చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ లెటర్ రాసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.