బీజేపీలో చేరిన నిట్టూరి సమ్మయ్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిట్టూరి సమ్మయ్య బిజెపి పార్టీలో చేరారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామానికి చెందిన సమ్మయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మంచిర్యాల జిల్లా పదాధికారులు, వేమనపల్లి మండల బిజెపి నాయకులు కొత్తూరి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్