సిర్పూర్ టీ మండలం టోంకిని గ్రామంలో పండుగ వాతావరణం ఉండగా మరో వైపు విషాదఛాయలు అలుముకున్నాయి. ఈనెల 9న గ్రామానికి చెందిన చౌదరి జయేందర్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు శనివారం ఉదయం యువకుడి మృతదేహం వార్ధా నదిలో లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.