మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పొన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి, లేమూరు వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్యగా గుర్తించారు. రోజువారీ పని నిమిత్తం ఆటోలో మంచిర్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.