మంచిర్యాలలోని అశోక్ రోడ్డులో దారుణం జరిగింది. భర్త మోహన్ (45)ను భార్య జమున (40) రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేసింది. యూట్యూబ్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అతను భార్యను అనుమానిస్తూ, వేధింపులకు గురిచేయడమే హత్యకు కారణమని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.