బాసర: ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి యువకుడు మృతి

బాసర గోదావరిలో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. శర్మ దిల్ కుష్ (19) బీహార్ నుండి హమాలీ పని నిమిత్తం వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి బాసరలో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. గజ ఈతగల్లా సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్