బాసర: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం ముథోల్ మండలం విఠోలి తండాకు చెందిన రారోడ్ కైలాస్(46) కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కుమారుడు చదువుకోసం చేసిన అప్పులతో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చారు. బుధవారం ఓని వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్