నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన కొమ్ము సుమలత వారి ఇంటి వద్ద నెల కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురువారం బాసర గోదావరి నదిలో దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు. అనతరం కాన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.