భైంసా బైపాస్ రోడ్డులో అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భైంసా పట్టణంలోని తమ బంధువుల ఇంటికి ఆదివారం ఫంక్షన్ నిమిత్తం వచ్చిన సుమన్ (32), సృజన్ తిరిగి తమ ఇంటికి నిర్మల్ రూరల్ లంగడ పూర్ కు వెళుతున్న క్రమంలో అదుపుతప్పి కారు బోల్తా పడడంతో సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా సృజన్ కు తీవ్ర గాయాలయ్యాయి.