నిర్మల్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం పార్డి(బి) గ్రామానికి చెందిన పొనకంటి సాయినాథ్ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సాయినాథ్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్