కుంటాల: మృతదేహం ఆచూకీ లభ్యం

కుంటాల మండలం కల్లూరు వాగు సమీపంలో మంగళవారం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ తెలిసిమటట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. అక్కడ లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని భైంసా పట్టణం జక్కుల గజ్జారాం (49) గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని భైంసా గ్రామీణ సీఐ నైలు పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఘటనా స్థలంలోనే శవపంచనామా నిర్వహించి అక్కడే ఖననం చేశారు.

సంబంధిత పోస్ట్