ప్రమాద వశాత్తు బైక్ పై నుండి పడి మహిళ మృతి చెందిన ఘటన శనివారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్లూరు గ్రామానికి చెందిన పసుల సాయన్న, భార్య పసుల గోదావరితో కలిసి లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా హవర్గా గ్రామ సమీపంలో కళ్ళు తిరిగి బైక్ పై నుండి పడిపోగా చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.