కుంటాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం కుంటాలకు చెందిన ఆయిటి రాజు (26) రాజు పని నిమిత్తం ఓలా గ్రామం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కుంటాల గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్