కన్నతండ్రిని కిరాతకంగా కొడుకు హత్య చేసిన సంఘటన శనివారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రాజురకు చెందిన గన్నారం భూమన్న భార్య సంవత్సరం క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి తండ్రి భూమన్న (80) తో నివాసం ఉంటున్నారు. ఇటీవల తండ్రికి సరిగా తిండి పెట్టడం లేదని కొడుకుతో గొడవ పడ్డాడు. తెల్లవారు జామున రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు.