నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబర్ శివారులో చిరుతపులి కలకలం రేపింది. మంగళవారం రాత్రి వ్యవసాయ కొట్టంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపినట్లు రైతు చోక్క బోట్లు సాయినాథ్ తెలిపారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ రక్తమడుగులో మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలాన్ని పరిశీలించి అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. నిత్యం సంచరిస్తున్న చిరుతను వెంటనే బోను ఏర్పాటు చేసి బంధించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామస్థులు కోరారు.