నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటుచేసుకుంది. ఎల్వీ గ్రామానికి చెందిన గంగాధర్ కుమారుడు లోకండే విశాల్ (25), , మధ్యాహ్నం సమయంలో గ్రామస్థులతో కలిసి గణేష్ నిమజ్జనం కోసం బాసర గోదావరి నదికి వచ్చాడు. నిమజ్జనం పూర్తయ్యాక అందరితో కలిసి భోజనం కోసం సత్రానికి వెళ్లాడు. అనంతరం ఒక్కడే మళ్లీ స్నానం చేసి వస్తానని చెప్పి గోదావరికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుని తల్లి లోకండే కమలాబాయి ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.