ఈ నెల 8న నిర్మల్ కు అమిత్ షా రాక

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 8న నిర్మల్ పట్టణానికి రానున్నారు. ఈ మేరకు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఆదివారం బీజేపీ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సభలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ తదితరులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్