ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఆప్

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం ఈ సర్వే పత్రాలను ఆయన అందుకున్నారు. ఓటరు జాబితాల పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఈ సర్వే జరుగుతోందని, 2002 కుటుంబ వివరాల ఆధారంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్