కనకాపూర్ వైన్స్‌లో గొడవ: స్నేహితుడిపై బీరు బాటిల్‌తో దాడి

నిర్మల్ నియోజకవర్గంలోని రాచాపూర్ గ్రామానికి చెందిన జడ రజనీకాంత్, పని నిమిత్తం కనకాపూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా, అదే గ్రామానికి చెందిన తక్కల సాయికుమార్ వచ్చి డబ్బులు ఇవ్వాలని వేధించాడు. రజనీకాంత్ వద్ద డబ్బులు లేవని చెప్పినా వినకుండా, అతని పేరుపై స్టాఫ్ తీసుకున్నాడు. దీనిపై రజనీకాంత్ ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి, సాయికుమార్ బీరు బాటిల్‌తో రజనీకాంత్ ముఖం, దవడ, కుడి చేతిపై దాడి చేశాడు. దీంతో రజనీకాంత్‌కు రక్త గాయాలయ్యాయి. గ్రామస్తులు అతన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రజనీకాంత్ భార్య రాజశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్