సారంగాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. చించోలి (బి), సారంగాపూర్, స్వర్ణ, దుప్య తండా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మాధవరావు తెలిపారు. ఉదయం 11: 15 గంటల నుండి ఈ పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.